హరితహారము కార్యక్రమం నినాదాలు, హరితహారం ప్రతిజ్ఞ - Haritha Haram Pledge, Slogans 2018

హరితహారము కార్యక్రమం నినాదాలు, హరితహారం ప్రతిజ్ఞ - Haritha Haram Pledge 2018 - హరిత పాఠశాల - హరిత తెలంగాణ కార్యక్రమం : ‘‘హరిత పాఠశాల-హరిత తెలంగాణ’’ నినాదంతో తెలంగాణలోని అన్ని విద్యా సంస్థల్లో హరితహారం కార్యక్రమాన్ని ఈ నెల 25వ తేదీన భారీగా నిర్వహించనున్నారు . భవిష్యత్ తరాలకు బంగారు భవితవ్యాన్ని అందించాలంటే పర్యావరణాన్ని రక్షించాలనే గొప్ప ఉద్దేశ్యంతో రూపొందించిన హరితహారం కార్యక్రమాన్ని నాల్గవ దశలో భాగంగా విద్యా సంస్థల్లో ‘‘ హరిత పాఠశాల-హరిత తెలంగాణ’’ పేరుతో ఈ నెల 25వ తేదీన ఘనంగా నిర్వహించనున్నారు.

హరిత పాఠశాల - హరిత తెలంగాణ కార్యక్రమం,Telanganaku Haritha Haram (TKHH) Pledge,హరితహారం ప్రతిజ్ఞ,హరితహారము కార్యక్రమం నినాదాలు,తెలంగాణ హరితహారం నినాదాలు,Haritha Haram slogans

Telanganaku Haritha Haram (TKHH) Pledge:
హరితహారం ప్రతిజ్ఞ: 
సుసంపన్నమైన, సస్యశ్యామలమైన మన తెలంగాణ నవ యవ్వనంతో తొణికిసలాడుతూ ఉరకలెత్తే ఉత్సాహంతో ముందుకు, మున్ముందుకు పరుగులు తీస్తూ, అన్ని రంగాల్లో అద్వితీయమైన ప్రగతిని నమోదు చేస్తూ, బంగారు తెలంగాణ గ రూపుదిద్దుకుంటున్న ఈ సమయంలో మన తెలంగాణ తల్లికి హరితహారం సమర్పించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తానని, మరియు నా వంతుగా పది, నా సహచరులతో పది చొప్పున మొక్కలు నాటిన చేస్తానని ప్రతిజ్ఞ చేయుచున్నాను.


హరితహారము కార్యక్రమం సందర్భంగా కొన్ని నినాదాలు
✓అడవులు మానవ మనుగడకు జీవనాధారం
✓చెట్లు మన చుట్టూ ఉన్న మౌన నేస్తాలు
✓పచ్చదనం-మన ప్రగతికి సంకేతం
✓జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందాం
✓భవిష్యత్ తరాలకు భద్రతనిద్దాం
✓వనాలను దేవతలుగా పూజిద్దాం-ప్రపంచాన్ని పదికాలాలు కాపాడుకుందాం
✓వృక్షాలులేనిదే వన్యప్రాణులు లేవు-వన్య ప్రాణులు లేనిదే వృక్షాలు లేవు
✓ఊరంతా వనం-ఆరోగ్యంగా మనం
✓మన చెట్టు--మన నీడ-మన ఆరోగ్యం
✓మట్టి ప్రతిమలనే పూజిద్దాం-పర్యావరణాన్ని కాపాడుకుందాం
✓చెట్లు నేల పటుత్వాన్ని, భూసారాన్ని చక్కగా కాపాడతాయి
✓వృక్షో రక్షతి రక్షితః అనగా చెట్టును మనంకాపాడితే ఆ చెట్టు మనల్ని కాపాడుతుంది అని అర్ధం.
✓చెట్లను నాటాలి, పెంచాలి, వాటిని రక్షించాలి
✓వనాలు పెంచు-వానలు వచ్చు
✓చెట్లను పెంచు-ఆక్సిజన్‌ పీల్చు
✓పచ్చని అడవులు-సహజ సౌందర్యములు
✓వనాలు-మానవాళి వరాలు
✓పచ్చని వనములు-ఆర్థిక వనరులు
✓అడవులు-మనకు అండదండలు
✓అడవి ఉంటే లాభం-అడవి లేకుంటే నష్టం
✓అడవిని కాపాడు-మనిషికి ఉపయోగపడు
✓అటవీ సంపద-అందరి సంపద
✓చెట్లు నరుకుట వద్దు-చెట్లు పెంచుట ముద్దు
✓అడవులు-వణ్యప్రాముల గృహములు
✓పచ్చని వనాలు-రోడ్డునకు అందములు
✓సతతం-హరితం
✓మొక్కలు ఉంటే ప్రగతి-మొక్కలు లేకుంటే వెలితి
✓చెట్టుకింద చేరు-సేదను తీరు
✓అడవులు ఉంటే కలిమి-అడవులు లేకుంటే లేమి
✓అడవులు అంతరించడం అంటే-మనిషి పతనం అయినట్టే మొక్కను పట్టు-భూమిలో నాటు
✓దోసిలిలోకి తీసుకోమొక్కా!-ఏదోస్థలమున నాటుము ఎంచక్కా!!
✓స్వార్ధం లేని మొక్కని చూడు-ఓర్పుగ బ్రతకడం నేర్పుతుంది
✓పర్యావరణాన్ని రక్షించండి అది మిమ్మల్ని రక్షిస్తుంది
✓ప్రకృతి లేకుంటే మానవ మనుగడే ప్రశ్నార్ధకం
✓ప్రకృతిని సంరక్షించుకోవడం ప్రతి మనిషి బాధ్యత.
✓పచ్చని చెట్టు-మన ప్రగతికి మెట్టు
✓వృక్షాలు- మన శరీరం బయటఉండే ఊపిరితిత్తులు
✓ఇంటింటా చెట్లు - ఊరంతా పచ్చదనం
✓వృక్ష సంపదను పెంచాలి-స్వచ్ఛతనే సాధించాలి
✓బిడ్డకు తల్లి రక్షణ-భూమికి ఓజోన్ రక్షణ
✓మొక్కలు నాటండి! పర్యావరణాన్ని రక్షించండి
✓జీవులను బ్రతకనిస్తే అవి మనలను బ్రతకనిస్తాయి
✓జల సంరక్షణ-వన సంరక్షణ
✓పర్యావరణ రక్ష-విపత్తులకు శిక్ష
✓సృష్టికి మూలం జీవం-జీవానికి మూలం వనం
✓ఇంటింటికీ చెట్లు-సంక్షేమానికి మెట్లు
✓వరాల వర్షం కురవాలంటే -పసిడి పంటలే పండాలంటే చిన్నా పెద్దా చేతులు కలిపి చెట్టూచేమనే పెంచాం
✓మొక్కలు నాటడం గొప్ప కార్యం-సంరక్షించడం .


తెలంగాణ హరితహారం నినాదాలు:
1. పచ్చని చెట్లు - ప్రగతికి మెట్లు
2. చెట్లను పెంచు - ఆరోగ్యాన్ని పంచు
3. చెట్లే జగతికి ప్రాణాధారం
4. కదిలే బొమ్మల చాటున బాధలను మింగుతుంది - తనలో దాగిన మధువును అందరికీ పంచుతుంది
5. చెట్లను నీవు రక్షిస్తే - చెట్లు నిన్ను రక్షిస్తాయి (వృక్షో రక్షతి  రక్షితః)
6. ప్రకృతి ప్రసాదించిన వరమే వృక్షం -  జగతికి జీవన సౌభాగ్యానికి అదే సాక్ష్యం
7. కాలుష్యాల భక్షణకు చెట్లే సకల జగద్రక్ష
8. పర్యావరణాన్ని రక్షించే పచ్చని చెట్లు పెంచు
9. అడవికి నిప్పు - పర్యావరణానికి ముప్పు
10. చెట్లను నాటుదాం - ప్రకృతిని రక్షిద్దాం
11. ఉద్యమంగా కదులుదాం - ఊరంతా మొక్కలు నాటుదాం
12. చెట్టులేని ఊరు - ఎన్నో  కష్టాల ఏరు
13. చెట్టే మనిషికి తోడు - చెట్టే పుడమికి జోడు
14. వన సంపద సర్వ సంపదల కన్నా మిన్న
15. అమ్మ ప్రేమ నిస్తుంది - చెట్టు నీడనిస్తుంది
16. మంచితనం మనిషికి అందం - పచ్చదనం ఊరికి అందం
17. మనకు బతుకునిచ్చిన చెట్లను బతుకంతా బతకనిద్దాం
18. వృక్షాలను రక్షించు ఆరోగ్యంగా జీవించు
19. మొక్కలు భగవంతుని ప్రేమకు ప్రతిరూపాలు
20. చెట్ల పెంపకానికి అడ్డులేదు - సుఖవంతమైన జీవితానికి అదుపు లేదు
21. పశుపక్షాదులు వృక్షాలు మనలను రక్షించే దేశ సంపద
22. ఆరోగ్య దీపిక - అడుగుకొక చెట్టు నాటిక
23. చక్కగా పెరిగే చెట్టు - మన జీవితాలకు ఆయువుపట్టు
24.  శబ్దకాలుష్యం తగ్గించు నచ్చిన చెట్టు పెంచు
25. వాన కురవాలా  చెట్లు నాటాలా

Post a Comment

0 Comments

f