ఏపీ అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు, చివరి తేదీ అక్టోబర్ 15, 2018

ఏపీ విజయవాడలో అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకురాలు ఉద్యోగాలు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం అధికారిణి ఎస్‌.సువర్ణ (ఐసీడీఎస్‌, ప్రాజెక్టు - 2) ఒక ప్రకటనలో తెలిపారు.


ఆంధ్ర ప్రదేశ్ ఐటీడీఏ అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు,కార్యకర్త పోస్టులు,ఆయా పోస్టులు,మినీ అంగన్‌వాడీ కార్యకర్త పోస్టులు,అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు, మినీ అంగన్‌వాడీ కార్యకర్తల ఉద్యోగాల భర్తీ

ఖాళీగా ఉన్న పోస్టుల జాబితా
అంగన్‌వాడీ కార్యకర్త :
 పప్పుల మిల్లు కాలువ గట్టు (కేటగిరి - బీసీ-బీ),
కేఎల్‌ రావు నగర్‌ - 2 (కేటగిరి ఎస్టీ),
గిరిపురం - 3 (కేటగిరి ఎస్సీ),
బాలాజీనగర్‌ - 2 (కేటగిరి ఎస్టీ),
మొగల్రాజపురం - 3 (కేటగిరి బీసీ-బీ),
ఆటోనగర్‌ - 1 (కేటగిరి జనరల్‌),
నెహ్రూ నగర్‌ (కేటగిరి జనరల్‌),
గుణదల వంతెన (కేటగిరి జనరల్‌),
డ్రైవపేట - 1 (కేటగిరి జనరల్‌),
లంబాడీపేట (కేటగిరి - జనరల్‌),
క్రిస్టియన్‌ పేట (కేటగిరి జనరల్‌).

అంగన్‌వాడీ సహాయకురాలు : 
కస్తూరిబాయిపేట (కేటగిరి బీసీ-సీ),
మొగల్రాజపురం - 5 (కేటగిరి బీసీ-ఏ),
రోకళ్లపాలెం - 1 (కేటగిరి బీసీ-బీ),
కేఎల్‌ రావు నగర్‌ -2 (కేటగిరి బీసీ-ఏ),
మధురానగర్‌ - 2 (కేటగిరి బీసీ-బీ),
అరండల్‌ పేట (కేటగిరి జనరల్‌),
మారుతీ నగర్‌ (కేటగిరి - జనరల్‌),
మాచవరం - 2 (కేటగిరి బీసీ-ఈ),
బాడవ పేట (కేటగిరి - బీసీ-ఈ),
రాణిగారితోట - 6 (కేటగిరి జనరల్‌),

అంగన్‌వాడీ కేంద్రాల్లో అంగన్‌వాడీ కార్యకర్త, అంగన్‌వాడీ సహాయకురాలు ఉద్యోగాలకు అర్హులైన మహిళా అభ్యర్థుల దరఖాస్తుపై ఏ ఉద్యోగాలకు, ఏ అంగన్‌వాడీ కేంద్రానికి దరఖాస్తు చేస్తున్నారో స్పష్టంగా రాయాలి.

అర్హతలు:
1. స్థానిక వివాహిత మహిళలు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి.
2.  1 జూలై 2018 నాటికి 21 సంవత్సరాలు నిండి 35 సంవత్సరాలలోపు వయస్సు వారు మాత్రమే అర్హులు.
3. అంగన్‌వాడీ కార్యకర్త, అంగన్‌వాడీ సహాయకురాలి పోస్టులకు 10వ తరగతి ఉతీర్ణులై ఉండాలి.
4. ఈ పోస్టులకు విద్యార్హత, తగిన కుల ధ్రువీకరణ పత్రాలు, జిరాక్స్‌, ఆధార్‌ కార్డు జిరాక్స్‌ జతపరిచి ఈ నెల 15వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు (పూర్తి పని దినాలలో) కానూరు, చర్చి తరువాత ఉన్న రోడ్డు, ఉమాశంకర్‌ నగర్‌లోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో గల సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం అధికారిణి, ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ - 2, విజయవాడ, కార్యాలయంలో దరఖాస్తులు వ్యక్తిగతంగా అందజేయాలని  కోరారు.


***
AP State లో అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు: ఆంధ్ర ప్రదేశ్  ఐటీడీఏ(జిల్లాలో)వివిధ మండలాల్లో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు, మినీ అంగన్‌వాడీ కార్యకర్తల ఉద్యోగాల భర్తీ కోసం అర్హత గల గిరిజన, గిరిజనేతర మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ఐటీడీఏ పీవో ఎల్‌.శివశంకర్‌ తెలిపారు. మొత్తం 85 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.

కార్యకర్త పోస్టులు 8,
ఆయా పోస్టులు 34,
మినీ అంగన్‌వాడీ కార్యకర్త పోస్టులు 43 చొప్పున ఖాళీలున్నాయన్నారు.

2018 జులై 1 నాటికి 21 నుంచి 35 మధ్య ఏళ్లతో పాటు స్థానిక వివాహిత మహిళా అభ్యర్థులు అర్హులన్నారు.

 తాత్కాలిక పద్ధతిలో నియామకాలుంటాయన్నారు.

దరఖాస్తులు సెప్టెంబర్‌ 18వ తేదీ సాయంత్ర ఐదు గంటల్లోగా కార్యాలయం పని వేళల్లో ఒరిజినల్‌ ధ్రువపత్రాలతో స్వయంగా ఐటీడీఏ కార్యాలయానికి హాజరై దరఖాస్తులు అందజేయాలన్నారు.

రాత పరీక్ష సెప్టెంబర్‌ 20వ తేదీ ఉదయం 11 నుంచి ఒంటి గంట వరకు సీతంపేట వైటీసీలో జరుగుతుందన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ ఐటీడీఏ,అంగన్‌వాడీ పోస్టుల భర్తీ, అంగన్‌వాడీ ఉద్యోగాలు

Post a Comment

1 Comments

Please add your comment here

f