ఎల్ఐసీ గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్లు: ఎల్ఐసీ ఏటా అందించే ‘గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్’ ప్రకటన త్వరలో విడుదల కానుంది. మెడిసిన్, ఇంజినీరింగ్, డిగ్రీ, ఏదేని రంగంలో డిప్లొమా కోర్సు/ తత్సమాన విద్య చదివేవారికి ఈ ఉపకార వేతనాలు ఇస్తారు. వీరికి ఇంటర్లో కనీసం 60% మార్కులు వచ్చుండాలి. ప్రస్తుతం ఏదైనా ఒకేషనల్ కోర్సు లేదా ఐటీఐ చదువుతున్నవారైతే 2017-18 విద్యా సంవత్సరానికి పదో తరగతిలో కనీసం 60% మార్కులు సాధించి ఉండాలి. దరఖాస్తుదారుల తల్లిదండ్రుల ఆదాయం ఏడాదికి రూ.లక్షకు మించకూడదు.

ఎల్ఐసీ గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్: ఉన్నత చదువులు చదవాలనే అభిలాష ఉన్నప్పటికీ ఆర్థికంగా స్థోమత లేనివారికి ఎల్ఐసీ సంస్థ ఉపకార వేతనాలు అందిస్తోంది. విద్యాపరంగా ప్రతిభ, తల్లిదండ్రుల వార్షికాదాయం ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు. ‘ఎల్ఐసీ గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్’పేరిట ఏటా అందించే ఈ స్కాలర్షిప్పులకు సెప్టెంబరులో ప్రకటన విడుదల కానుంది.
ఆర్థికంగా వెనుకబడినవారికి ఉన్నతవిద్య పరంగా ప్రోత్సాహమందించి, ఉద్యోగావకాశాలను మెరుగుపరచాలనే ఉద్దేశంతో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) ఏటా గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ను అందిస్తోంది. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాల/ యూనివర్సిటీల్లో ఉన్నతవిద్యను చదివేవారికి దీన్ని అందజేస్తారు.
ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు/ సెంటర్లలో గ్రాడ్యుయేషన్ స్థాయిలో టెక్నికల్, ఒకేషనల్ కోర్సులు చేసేవారు కూడా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఆ సంస్థలు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ (ఎన్సీవీటీ) గుర్తింపు పొందినవై ఉండాలి.
అర్హత: 2017-18 విద్యా సంవత్సరానికిగానూ ఇంటర్ లేదా తత్సమాన విద్య పూర్తిచేసినవారై ఉండాలి. ఉన్నతవిద్యలో మెడిసిన్, ఇంజినీరింగ్, ఏదేని డిగ్రీ, ఏదేని రంగంలో డిప్లొమా కోర్సు/ తత్సమాన విద్య చదవాలనుకునేవారు అర్హులు. వీరికి ఇంటర్లో కనీసం 60% మార్కులు వచ్చుండాలి. తల్లిదండ్రుల ఆదాయం ఏడాదికి రూ.లక్షకు మించకూడదు. ప్రస్తుతం ఏదైనా ఒకేషనల్ కోర్సు లేదా ఐటీఐ చదువుతున్నవారైతే 2017-18 విద్యా సంవత్సరానికిగానూ పదో తరగతిలో కనీసం 60% మార్కులు సాధించి ఉండాలి. తల్లిదండ్రుల ఆదాయం ఏడాదికి రూ.లక్షకు మించకూడదు.
స్కాలర్షిప్ మొత్తం: ఎంపికైనవారికి నెలకు రూ.1000 చొప్పున ఏడాదికి రూ.10,000 చెల్లిస్తారు. ఈ మొత్తాన్ని విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమచేస్తారు.
దరఖాస్తు: ఎల్ఐసీ అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆదాయపు సర్టిఫికెట్ను కూడా సమర్పించాలి.
ఎంపిక ఎలా?: అకడమిక్ మెరిట్, కుటుంబ ఆర్థిక నేపథ్యం ఆధారంగా ఎంపికచేస్తారు. కుటుంబంలో ఒక్కరికే చెల్లిస్తారు. కోర్సు పూర్తికాలం స్కాలర్షిప్ అందుతుంది. అయితే చేరిన ప్రొఫెషనల్ కోర్సుల్లో 55%, డిగ్రీ కోర్సుల్లో 50% సాధించినవారికే తరువాతి సంవత్సరం స్కాలర్షిప్ అందుతుంది.
ఈ స్కాలర్షిప్ పూర్తి వివరాలకు వెబ్సైట్ను సందర్శించవచ్చు.
వెబ్సైట్: www.licindia.in

0 Comments
Please add your comment here