ఏపీ డీఎస్సీ : ఏపీ టీఆర్టీ, ఏపీ టెట్ కమ్ టీఆర్టీ 2018 ప్రకటన విడుదల

ఏపీ డీఎస్సీ : ఏపీ టీఆర్టీ, ఏపీ టెట్ కమ్ టీఆర్టీ 2018 ప్రకటన విడుదల: డీఎస్సీ షెడ్యూల్‌ను గురువారం(అక్టోబరు 25) విడుదల చేశారు. ప్రభుత్వ, జడ్పీ, ఎంపీ, పురపాలిక, గిరిజన, బీసీ సంక్షేమశాఖ, ఆదర్శ పాఠశాలల పోస్టులు మొత్తం కలిపి 7,729 భర్తీ చేయనున్నారు. వీటికి శుక్రవారం(అక్టోబరు 26) ప్రకటన విడుదల కానుంది. ఈసారి నిరుద్యోగులకు వయోపరిమితిని 42 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంపు చేసినట్లు మంత్రి ప్రకటించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, విభిన్న ప్రతిభావంతులకు రెండేళ్ల చొప్పున పెంపు చేశారు. ఈ ఏడాది మార్చి వరకు ఉన్న ఖాళీలను పరిగణలోకి తీసుకుని పోస్టులను ప్రకటించినట్లు మంత్రి గంటా వెల్లడించారు.


ఏపీ డీఎస్సీ 2018,ఏపీ టీఆర్టీ 2018,ఏపీ టెట్ కమ్ టీఆర్టీ 2018,ఏపీ డీఎస్సీ (ఏపీ టీఆర్టీ, ఏపీ టెట్ కమ్ టీఆర్టీ) షెడ్యూల్‌,ఏపీ డీఎస్సీ (ఏపీ టీఆర్టీ, ఏపీ టెట్ కమ్ టీఆర్టీ) ప్రకటన

డీఎస్సీ పోస్టులు: 7,325

డీఎస్సీ పరీక్ష:
డీఎస్సీ పరీక్షను రెండు సెషన్లలో నిర్వహించనున్నారు.
1. పీజీటీ, ప్రిన్సిపల్, మ్యూజిక్, క్రాఫ్ట్, ఆర్ట్, డ్రాయింగ్, ఎస్జీటీలకు పరీక్షా సమయం మూడు గంటలు,
2. మిగతా పరీక్షలకు రెండున్నర గంటలు ఇవ్వనున్నారు.
వ్యాయామ ఉపాధ్యాయ అభ్యర్థులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ కొందరు ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. ఈ కేసు పెండింగ్‌లో ఉన్నందున ట్రైబ్యునల్‌ ఆదేశాల మేరకు డీఎస్సీ నిర్వహించనున్నారు.

పోస్టుల వారీగా పరీక్షలు ఇలా.. 
* ఎస్జీటీ పోస్టులకు డీఎస్సీ, ఉపాధ్యాయ అర్హత(టెట్‌) కలిపి 100 మార్కులకు నిర్వహించనున్నారు.
* మ్యూజిక్‌ పోస్టులకు డీఎస్సీలో రాత పరీక్షకు 70 మార్కులకు ఉంటుంది. మ్యూజిక్‌ నైపుణ పరీక్షకు 30 మార్కులు
* టీజీటీ, పీజీటీ పోస్టులకు ఆంగ్ల స్క్రీనింగ్‌ పరీక్ష ఉంటుంది. ఇందులో ఓసీ, బీసీ అభ్యర్థులు 60% ఎస్సీ, ఎస్టీ, విభిన్న ప్రతిభావంతులకు 50% మార్కులు వస్తేనే మిగతా సమాధానాలను పరిగణలోకి తీసుకుంటారు.
* వ్యాయామ ఉపాధ్యాయులకు డీఎస్సీ రాత పరీక్షకు 50 మార్కులు, వ్యాయామ పరీక్షలకు 30, టెట్‌కు 20 మార్కులు వెయిటెజీ ఇవ్వనున్నారు.
* పీజీటీ, ఆర్ట్, డ్రాయిండ్, క్రాఫ్ట్, ప్రిన్సిపల్‌కు వంద మార్కులకు పరీక్ష ఉంటుంది.

డీఎస్సీ షెడ్యూల్‌:
రుసుము చెల్లింపు: నవంబరు 1 నుంచి 15 వరకు
ఆన్‌లైన్‌ దరఖాస్తు సమర్పణ: నవంబరు 1 నుంచి 16 వరకు
హెల్ప్‌డెస్క్‌ సేవలు: నవంబరు 1 నుంచి జనవరి 12 వరకు పొందవచ్చు
పరీక్షా కేంద్రాలకు ఐచ్చికాలు: నవంబరు 19 నుంచి 24 వరకు ఇచ్చుకోవచ్చు
ఆన్‌లైన్‌ నమూన పరీక్ష: నవంబరు 17 నుంచి
హాల్‌టిక్కెట్ల డౌన్‌లోడ్‌: నవంబరు 29 నుంచి

ఆన్‌లైన్‌ పరీక్షల నిర్వహణ 
స్కూల్‌అసిస్టెంట్లు భాషేతర: డిసెంబరు 6, 10
స్కూల్‌ అసిస్టెంట్లు భాషలు: డిసెంబరు 11
పోస్టుగ్రాడ్యుయేట్‌ ఉపాధ్యాయులు: డిసెంబరు 12, 13
ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్‌ ఉపాధ్యాయ, ప్రిన్సిపల్‌: డిసెంబరు 14, 26
పీఈటీ, మ్యూజిక్, క్రాఫ్ట్, ఆర్ట్, డ్రాయిండ్‌: డిసెంబరు 17
భాషాపండితులు: డిసెంబరు 27
ఎస్జీటీ: డిసెంబరు 28 నుంచి జనవరి 2వరకు

Post a Comment

0 Comments

f