ఏపీ డీఎస్సీ సిలబస్‌, ఎగ్జామ్ పాటర్న్ 2018

ఏపీ డీఎస్సీ ప్రకటన విడుదల: ఆన్‌లైన్‌లోనే డీఎస్సీ పరీక్షల నిర్వహణ. ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అభ్యర్థులకు తీపికబురు. పాఠశాల విద్యాశాఖ అక్టోబరు 26 న డీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు 67, 68 ఉత్తర్వులు జారీచేసింది. ఎట్టకేలకు ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియ మొదలైంది. ఈ పరీక్షలను ఆన్‌లైన్‌లోనే నిర్వహించనున్నారు. కంప్యూటర్ల సామర్థ్యం ఆధారంగా అభ్యర్థులకు పరీక్ష కేంద్రాలను పక్క జిల్లాలు, రాష్ట్రాల్లోనూ కేటాయించనున్నట్లు ప్రకటనలోనే పేర్కొన్నారు. ఒక్కో కేంద్రంలో విడతకు 300 నుంచి 500 మంది పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేయనున్నారు. నియామక పోస్టులకు పాఠ్యప్రణాళిక(సిలబస్‌) విడుదల చేశారు.

ఏపీ డీఎస్సీ సిలబస్‌,ఏపీ డీఎస్సీ ఎగ్జామ్ పాటర్న్,ఏపీ డీఎస్సీ పాఠ్యప్రణాళిక,ఏపీ డీఎస్సీ పరీక్ష విధానం,ఏపీ టెట్ కమ్ టీఆర్టీ సిలబస్‌,ఏపీ టెట్ కమ్ టీఆర్టీ ఎగ్జామ్ పాటర్న్,ఏపీ టీఆర్టీ సిలబస్‌,ఏపీ టీఆర్టీ ఎగ్జామ్ పాటర్న్

1. ఎస్జీటీలకు మాత్రమే ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌), ఉపాధ్యాయ నియామక పరీక్ష(టీఆర్టీ) కలిపి నిర్వహించనున్నారు.
2. ఇందులో ఓసీ-60%, బీసీ-50%, ఎస్సీ, ఎస్టీ, విభిన్నప్రతిభావంతులు-40% అర్హత మార్కులుగా నిర్ణయించారు.
3. గతంలో టెట్‌ రాసినవారికి ఏ పరీక్షలో ఎక్కువ మార్కులు వస్తే వాటినే పరిగణలోకి తీసుకుంటారు.

భాషాపండితులు, స్కూలు అసిస్టెంట్‌ పోస్టులకు.. 
* స్కూలు అసిస్టెంట్లు, భాషాపండితులకు 80 మార్కులకు ఉపాధ్యాయ నియామక పరీక్ష ఉంటుంది. టెట్‌ వెయిటేజీ 20 మార్కులు ఉంటాయి.
* జనరల్‌ నాలెడ్జ్, వర్తమాన వ్యవహారాలకు 10 మార్కులు
* విద్యలో దృక్పథం (పర్‌స్పెక్టివ్స్‌): 5
* తరగతి గది అన్వయం, విద్యా మనస్తత్వ శాస్త్రం(సైకాలజీ):5
* విషయం(కంటెంట్‌): 40
* బోధన శాస్త్రం(మెథడాలజీ): 20

వ్యాయామ ఉపాధ్యాయ పరీక్ష ఇలా.. 
* జనరల్‌ నాలెడ్జ్, వర్తమాన వ్యవహారాలు: 5మార్కులు
* విద్యలో దృక్పథం (పర్‌స్పెక్టివ్స్‌): 5
* వ్యాయామ విద్య బోధన(పెడగాజీ): 10
* కంటెంట్‌: 30
* శారీరక సామర్థ్య పరీక్ష: 30

* మ్యూజిక్‌ ఉపాధ్యాయ పోస్టులకు రాత పరీక్ష 70 మార్కులు, వాయిద్య నైపుణ్య పరీక్షకు 30 మార్కులు ఉంటాయి.

* క్రాఫ్ట్, ఆర్ట్, డ్రాయింగ్‌ పోస్టులకు 100 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది.

సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌ పరీక్ష.. 
* ఈసారి ఎస్జీటీ పోస్టులకు బీఈడీ ఉత్తీర్ణులకు అర్హత కల్పించారు. ఈ నేపథ్యంలో టెట్, టీఆర్టీ కలిపి నిర్వహిస్తున్నారు.100 మార్కుల్లో అభ్యర్థి సాధించిన మార్కులను 20శాతానికి లెక్కించి వాటిని టెట్‌ మార్కులుగా నిర్ణయిస్తారు.
* జనరల్‌ నాలెడ్జ్, వర్తమాన వ్యవహారాలు: 10
* విద్యలో దృక్పథం (పర్‌స్పెక్టివ్స్‌): 5
* విద్యా మనస్తత్వ శాస్త్రం: 10
* ఎంపిక చేసుకున్న భాష(లాంగ్వేజ్‌) కంటెంట్, మెథడాలజీ: 15
* లాంగ్వేజ్‌-2 కంటెంట్, మెథడాలజీ: 15
* గణితం కంటెంట్, మెథడాలజీ:15
* సామాన్యశాస్త్రం కంటెంట్, మెథడాలజీ: 15
* సాంఘిక శాస్త్రం కంటెంట్, మెథడాలజీ: 15

ప్రిన్సిపల్‌, పీజీటీ పోస్టులకు.. 
* ప్రిన్సిపల్, పీజీటీ పోస్టులకు పేపర్‌-1 ఆంగ్ల స్క్రీనింగ్‌ పరీక్ష 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధిస్తే పేపర్‌-2ను పరిగణనలోకి తీసుకుంటారు. రెండు పేపర్లు కలిపి 200 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది.
* జనరల్‌ నాలెడ్జ్, వర్తమాన వ్యవహారాలు: 15
* విద్యలో దృక్పథం (పర్‌స్పెక్టివ్స్‌): 15
* విద్యా మనస్తత్వ శాస్త్రం: 20
* పర్యవేక్షణ, నాయకత్వం, పరిపాలన, సాంఘిక, ఆర్థిక, సంస్కృతి కంటెంట్‌: 35
* మెథడాలజీ అవగాహన: 15

పీజీటీ నియామక పరీక్ష 
* జనరల్‌ నాలెడ్జ్, వర్తమాన వ్యవహారాలు: 10
* విద్యలో దృక్పథం (పర్‌స్పెక్టివ్స్‌): 10
* విద్యా మనస్తత్వ శాస్త్రం: 10
* కంటెంట్‌: 50
* మెథడాలజీ: 20

టీజీటీ పోస్టులకు.. 
టీజీటీ పోస్టులకు పేపర్‌-1 ఆంగ్ల స్క్రీనింగ్‌ పరీక్ష 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధిస్తే పేపర్‌-2ను పరిగణనలోకి తీసుకుంటారు. రెండు పేపర్లు కలిపి 180 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. స్కూల్‌ అసిస్టెంట్‌ టెట్‌కు 20% వెయిటేజీ ఉంటుంది.
* జనరల్‌ నాలెడ్జ్, వర్తమాన వ్యవహారాలు: 10
* విద్యలో దృక్పథం (పర్‌స్పెక్టివ్స్‌): 5
* తరగతి గది అన్వయం, విద్యా మనస్తత్వ శాస్త్రం: 5
* కంటెంట్‌: 40
* మెథడాలజీ: 20

ఏపీ డీఎస్సీ సిలబస్‌, ఏపీ డీఎస్సీ ఎగ్జామ్ పాటర్న్, ఏపీ డీఎస్సీ పాఠ్యప్రణాళిక, ఏపీ డీఎస్సీ పరీక్ష విధానం, ఏపీ టెట్ కమ్ టీఆర్టీ సిలబస్‌, ఏపీ టెట్ కమ్ టీఆర్టీ ఎగ్జామ్ పాటర్న్, ఏపీ టీఆర్టీ సిలబస్‌, ఏపీ టీఆర్టీ ఎగ్జామ్ పాటర్న్

Post a Comment

0 Comments

f