నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2019 (6వ తరగతి ప్రవేశాలు)

నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2019, నవోదయ ప్రవేశ పరీక్ష 2019 : జవహర్ నవోదయలో 2019-20 విద్యా సంవత్సరంలో ఉచితంగా 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు సిబిఎస్ఈ విద్యనభ్యసించేందుకు ప్రవేశ పరీక్షల ప్రకటన వెలువడింది.

నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2019,నవోదయ ప్రవేశ పరీక్ష 2019,జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష 2019,6వ తరగతి నవోదయ ప్రవేశ పరీక్ష

అర్హత: ప్రస్తుత విద్యాసంవత్సరమైన 2018-19 సంవత్సరంలో ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 5వ తరగతి విద్యనభ్యసిస్తుండాలి.

వయస్సు: 1-5-2006 నుంచి 30-4-2010 మధ్య జన్మించి ఉండాలి.

ప్రారంభతేది: అక్టోబరు 1వ తేదీ నుండి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

చివరి తేదీ: నవంబరు 30 2018 వరకు

పరీక్ష తేది: 06-04-2019

వెబ్ సైట్: ప్రవేశ పరీక్ష వివరాలు, దరఖాస్తు ఫారాలను www.navodaya.gov.in ద్వారా పొందవచ్చు.

నవోదయ పాఠశాలల్లో ప్రవేశాల దరఖాస్తు పద్ధతిని గత ఏడాది మార్చారు. ఈ ఏడాది మా వెబ్‌సైట్‌ www.navodaya.gov.in-లోనే దరఖాస్తు చేసుకునేందుకు పోర్టల్‌ను ఏర్పాటు చేశారు. అర్హతలు, ఆసక్తి ఉన్న విద్యార్థులు నవంబర్‌ 30లోపు దరఖాస్తు చేసుకోవాలి. సర్టిఫికెట్లను జేపీజే ఫార్మాట్‌లోకి తీసుకుని జత చేయాలి.

దరఖాస్తు నింపడంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు తగుజాగ్రత్త తీసుకోవాలి. గ్రామీణ/పట్టణ, రిజర్వేషన్‌ వంటి వివరాలను తప్పుల్లేకుండా నింపాలి. ఉదాహరణకు గ్రామీణ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా దరఖాస్తులో ఒక విద్యార్థి నమోదు చేసుకుంటాడు. సర్టిఫికెట్ల పరిశీలనలో అతను పట్టణ ప్రాంతంలో చదివినట్టు రుజువవుతుంది. అలాగే ఎస్సీ బదులు ఎస్టీ అని నమోదు చేస్తారు. తీరా ఎంపిక సమయంలో ఇలాంటివన్నీ బైటపడతాయి. దాంతో అడ్మిషన్‌ రద్దవుతుంది. అప్పుడు బాధపడటం తప్ప ప్రయోజ నం ఉండదు. అందువల్ల వివరాలు నింపేటప్పుడు జాగ్రత్తగా ఉంటే అడ్మిషన్‌ సమయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు.

దరఖాస్తులను సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయునిచే పూర్తిచేయించి, వారి సంతకము, తల్లి లేదా తండ్రి లేదా సంరక్షుని సంతకం, మండలవిద్యాశాఖాధికారి సంతకం చేయించి జనన ధృవీకరణ మరియు స్టడీ సర్టిఫికెట్స్ తదితర వివరాలను ఆన్లైన్లో అప్లైచేయాలి.

ప్రవేశ పరీక్ష విధానం :
వచ్చే ఏడాది ఆరో తరగతిలో ప్రవేశానికి ఉద్దేశించిన పరీక్ష లో ఎలాంటి మార్పుల్లేవు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 6న ఉదయం 11 గంటలకు పరీక్షకు హాజరవ్వాలి. ఉదయం 11.30 నుంచి 1.30 గంటల వరకు(2 గంటలు) పరీక్ష ఉంటుంది.
మెంటల్‌ ఎబిలిటీ నుంచి 40 ప్రశ్నలు 50మార్కులకు,
అర్థమెటిక్‌ నుంచి 20 ప్రశ్నలు 25 మార్కులకు,
లాంగ్వేజ్‌ విభాగం నుంచి 20 ప్రశ్నలు 25 మార్కులకు అడుగుతారు.
అంటే 80 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు.


నవోదయ రిజిస్ట్రేషన్ వెబ్ సైట్: NVS Registration Portal

నవోదయ వెబ్ సైట్: navodaya.gov.in

నవోదయ వెబ్ సైట్: NVS Hyderabad Region

#నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2019, #నవోదయ ప్రవేశ పరీక్ష 2019, #జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష 2019

Important: Online Application Process Involves 2 Steps:
Step I: Registration.
Step II: Submission of Personal Details (including uploading of Images).
Kindly keep the scanned copy of candidate's signature, parent's signature, candidate's photograph and class V certificate (Size:10-100 KB in .JPG/.jpg format) ready before filling up personal details.
Note:If all the are not completed,then your candidature will not be considered.

Important Dates:
Last date for submission of Application Form: 30-11-2018
NVS Exam date: 06-04-2019
Admit Cards issued : March 1st, 2019
NVS Result: Last week of May 2019

Post a Comment

0 Comments

f