టీఎస్ పోలీస్‌ కానిస్టేబుల్‌ ఎగ్జామ్ రిజల్ట్స్ (కానిస్టేబుల్‌ ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు)

కానిస్టేబుల్‌ ప్రాథమిక అర్హత పరీక్షల ఫలితాలు విడుదల. కానిస్టేబుల్ ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు 2,28,865 మంది. త్వరలో పార్ట్-2 దరఖాస్తులు, ఫిజికల్ టెస్ట్‌లు. తెలంగాణలో నిర్వహించిన పోలీస్‌ కానిస్టేబుల్‌ ప్రాథమిక అర్హత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షలో 50.09శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఈ ఫలితాలను టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. 16,925 పోస్టులకు సెప్టెంబర్‌ 30న ఈ పరీక్షలను నిర్వహించారు.

టీఎస్ పోలీస్‌ కానిస్టేబుల్‌ ఎగ్జామ్ రిజల్ట్స్ (కానిస్టేబుల్‌ ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు),టీఎస్‌ఎల్పీఆర్బీ ఫలితాలు, పోలీస్‌ కానిస్టేబుల్‌ పరీక్ష ఫలితాలు, పోలీస్‌ కానిస్టేబుల్‌ ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు, పోలీస్‌ కానిస్టేబుల్‌ ఫలితాలు

తెలంగాణ రాష్ట్రంలో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్పీఆర్బీ) విడుదల చేసింది. ఫలితాలను www.tslprb.in వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. మొత్తం 4,49,650 మంది అభ్యర్థులు ప్రిలిమ్స్‌కు హాజరవగా, వీరిలో 2,28,865 మంది అర్హత సాధించినట్టు టీఎస్‌ఎల్పీఆర్బీ తెలియపరిచినది. పరీక్షకు హాజరైనవారిలో 50.90 శాతం మంది అభ్యర్థులు ఫిజికల్ టెస్ట్‌లకు అర్హులుగా నిలిచారు. పురుషులు 3,73,042 మంది ప్రిలిమ్స్ పరీక్షకు హాజరుకాగా, 1,91,048 (51.21శాతం) మంది, మహిళా అభ్యర్థులు 76,608 మంది పరీక్ష రాయగా, 37,817 (49.36శాతం) మంది అర్హత సాధించారు.

ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించినవారికి పార్ట్-2 దరఖాస్తు నింపేందుకు త్వరలోనే అవకాశం కల్పించి, ఫిజికల్ టెస్ట్‌ల నిర్వహణకు తేదీలు ఖరారు చేయనున్నారు. 16,925 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం సెప్టెంబర్ 30న రాష్ట్రవ్యాప్తంగా 966 పరీక్ష కేంద్రాల్లో ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహించారు. ప్రాథమిక కీ విడుదల చేసిన టీఎస్‌ఎల్పీఆర్బీ.. ఈ నెల 8 వరకు అభ్యంతరాలను స్వీకరించింది. సిలబస్‌లో లేని ప్రశ్నలను మినహాయించిన తర్వాతే తుది ఫలితాలు విడుదల చేస్తున్నట్టు టీఎస్‌ఎల్పీఆర్బీ ఇదివరకే స్పష్టంచేసింది. అన్ని ప్రక్రియలు పక్కాగా పూర్తిచేసి ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు అక్టోబర్ 14 న విడుదలచేసింది. ప్రిలిమ్స్ పరీక్షకు బీసీ అభ్యర్థులు 2,35,977 మంది హాజరుకాగా, 96,352 (40.83శాతం) మంది అర్హత సాధించారు.

ఎస్సీ అభ్యర్థులు 94,240 మంది పరీక్షకు హాజరుకాగా, 65,160 (69.14శాతం) మంది, ఎస్టీ అభ్యర్థులు 77,122 మంది పరీక్ష రాయగా, 52,927 (68.63శాతం) మంది అర్హత సాధించారు. పరీక్ష రాసిన 36,973 మంది ఓసీ అభ్యర్థుల్లో 10,861 మంది (29.38శాతం) అర్హత సాధించారు. ఎక్స్‌సర్వీస్‌మెన్ క్యాటగిరీలో 5,338 మందికిగాను 3,565 (66.79శాతం) మంది అర్హత సాధించారు. 2015-16 రిక్రూట్‌మెంట్ ప్రిలిమ్స్ పరీక్షల్లో 39 శాతం మంది ఫిజికల్ టెస్టులకు అర్హత సాధించగా, తాజాగా విడుదల చేసిన ఫలితాల్లో 12 శాతం పెరుగుదలతో 51 శాతం మంది తర్వాతి దశకు అర్హత సాధించినట్టు టీఎస్‌ఎల్పీఆర్బీ చైర్మన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు.

మొత్తం 200 మార్కులకు అత్యధికంగా 151 మార్కులు, అత్యల్పంగా 12 మార్కులు వచ్చాయి. తదుపరి పరీక్షల ప్రణాళికను త్వరలోనే ప్రకటిస్తామని, పార్ట్‌-2 దరఖాస్తు పత్రాన్ని అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్లోనే సమర్పించాలని నియామక మండలి ఛైర్మన్‌ తెలిపారు.

వెబ్‌సైట్‌: www.tslprb.in 
కానిస్టేబుల్‌ ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు: పరీక్ష ఫలితాలు

పోలీస్‌ కానిస్టేబుల్‌ ఎగ్జామ్ రిజల్ట్స్, టీఎస్‌ఎల్పీఆర్బీ ఫలితాలు, పోలీస్‌ కానిస్టేబుల్‌ పరీక్ష ఫలితాలు, పోలీస్‌ కానిస్టేబుల్‌ ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు, పోలీస్‌ కానిస్టేబుల్‌ ఫలితాలు

Post a Comment

0 Comments

f