ఏపీ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ 2019 విడుదల

ఏపీ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌‌ పరీక్షల షెడ్యూల్‌ను న‌వంబ‌ర్ 14 న  విడుదల చేశారు. మొత్తం 1,448 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఫిబ్రవరి 27 నుంచి మార్చి 16వరకు , ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఫిబ్రవరి 28 నుంచి మార్చి18 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షలు ముగిసిన 22 రోజుల్లోపు ఫలితాలను వెల్లడించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం 10.64లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వ్యాల్యూ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించి ఫలితాను వెల్లడిస్తారు. సెంటర్లకు దారి తెలిపేలా యాప్‌ను విద్యార్థులకు పంపిస్తారు.

➜ ఇంటర్మీడియట్‌ పరీక్షలు 2019 ఫిబ్రవరి 27 నుంచి మొదలుకానున్నాయి.
➜ మొదటి సంవత్సర పరీక్షలు 27 నుంచి ఆరంభమై మార్చి 16తో ముగుస్తాయి.
➜ రెండో సంవత్సర పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు జరగనున్నాయి.
➜ ఈ పరీక్షలు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి.
➜ ఎథిక్స్, హ్యూమన్‌ వాల్యూస్‌ పరీక్షను 2019 జనవరి 28న,
➜ ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షను జనవరి 30న ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తారు.
➜ వీటిని ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారు.

జంబ్లింగ్‌లోనే ప్రాక్టికల్స్‌:
ఇంటర్‌ ప్రయోగ పరీక్షలు 2019 ఫిబ్రవరి ఒకటి నుంచి 20 వరకు జరుగుతాయని, గతేడాది మాదిరిగానే జంబ్లింగ్‌ పద్ధతిలోనే నిర్వహిస్తున్నారు. విద్యార్థులతో పాటు ఇన్విజిలేటర్లకు కూడా జంబ్లింగ్‌ ఉంటుంది. ఈ ఏడాది ఫలితాలను పాఠ్యాంశాల వారీగా గ్రేడ్‌ పాయింట్లతో ఇవ్వనున్నారు.

మొదటి సంవత్సరం పరీక్షల షెడ్యూల్‌ 
తేదీ - పరీక్ష పేపర్‌
27.02.2019 - సెకండ్‌ లాంగ్వేజ్‌
01.03.2019 - ఇంగ్లిష్‌
05.03.2019 - మ్యాథమెటిక్స్‌ పేపర్‌-1ఏ, బోటనీ పేపర్‌ , సివిక్స్‌ పేపర్‌
07.03.2019 - మ్యాథమెటిక్స్‌ పేపర్‌-1బి , జువాలజీ , హిస్టరీ
09.03.2019 - ఫిజిక్స్‌ , ఎకనామిక్స్‌
12.03.2019 - కెమిస్ట్రీ , కామర్స్‌ , సోషియాలజీ , ఫైన్‌ ఆర్ట్స్, మ్యూజిక్‌
14.03.2019 - జియాలజీ , పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ , లాజిక్‌ , బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్‌
16.03.2019 - మోడరన్‌ లాంగ్వేజ్‌

రెండో సంవత్సరం పరీక్షల షెడ్యూల్‌ 
తేది - పరీక్ష పేపర్‌
28.02.2019 - సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌
02.03.2019 - ఇంగ్లిష్‌
06.03.2019 - మ్యాథమెటిక్స్‌- 2ఏ , బోటనీ , సివిక్స్‌
08.03.2019 - మ్యాథమెటిక్స్‌ - 2బి , జువాలజీ , హిస్టరీ
11.03.2019 - ఫిజిక్స్‌ , ఎకనామిక్స్‌
13.03.2019 - కెమిస్ట్రీ , కామర్స్‌ , సోషియాలజీ , ఫైన్‌ ఆర్ట్స్, మ్యూజిక్‌
15.03.2019 - జియాలజీ , పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ , లాజిక్‌ , బ్రిడ్జి కోర్సు మేథ్స్‌
18.03.2019 - మోడరన్‌ లాంగ్వేజ్‌

Post a Comment

0 Comments

f