ఏపీ ఎస్.ఎస్.సి ఎగ్జామ్ ఫీ డేట్స్ 2018 (AP SSC Exam Fee due Dates)

AP SSC పరీక్ష రుసుము గడువు పొడిగింపు: పదో తరగతి పరీక్ష రుసుము చెల్లింపు గడువును పొడిగించినట్లు ఏపీ ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు తెలిపారు. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈనెల November 30వ తేదీలోపు పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి చెల్లించాల్సి ఉంటుంది. రూ.500 అపరాధ రుసుముతో జనవరి మూడో తేదీ వరకు అవకాశం కల్పించారు.


⇾ అపరాధ రుసుం లేకుండా : పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరు కావాలనుకునే విద్యార్థులు రుసుం చెల్లించేందుకు గడువును నవంబర్‌ 30 వరకు పెంచారు.
⇾ విద్యార్థులు చెల్లించే పరీక్ష రుసుమును సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సీఎఫ్‌ఎంఎస్‌ విధానంలో చెల్లించేందుకు డిసెంబరు 1 వరకు గడువు విధించారు.

⇾ రూ.50 అపరాధ రుసుంతో: నిర్ణీత గడువు అనంతరం రూ.50 అపరాధ రుసుంతో పరీక్ష రుసుం చెల్లించేందుకు డిసెంబరు 15 వరకు గడువు విధించారన్నారు.
⇾ విద్యార్థులు చెల్లించే పరీక్ష రుసుమును సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సీఎఫ్‌ఎంఎస్‌ విధానంలో చెల్లించేందుకు డిసెంబరు 17 వరకు గడువు విధించారు.

⇾ రూ.200 అపరాధ రుసుంతో: విద్యార్థులు రూ.200 అపరాధ రుసుంతో పరీక్ష రుసుం చెల్లించేందుకు డిసెంబరు 24 వరకు గడువు విధించారు.
⇾ విద్యార్థులు చెల్లించే పరీక్ష రుసుమును సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సీఎఫ్‌ఎంఎస్‌ విధానంలో చెల్లించేందుకు డిసెంబరు 27 వరకు గడువు విధించారు.

⇾ రూ.500 అపరాధ రుసుంతో: విద్యార్థులు రూ.500 అపరాధ రుసుంతో పరీక్ష రుసుం చెల్లించేందుకు 2019 జనవరి 3 వరకు గడువు విధించారని తెలిపారు.
⇾ విద్యార్థులు చెల్లించే పరీక్ష రుసుమును సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సీఎఫ్‌ఎంఎస్‌ విధానంలో చెల్లించేందుకు జనవరి 4 వరకు గడువు విధించారు.

Post a Comment

0 Comments

f